శ్లోకం - 5
శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాణి శతశో௨థ సహస్రశః | నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ పార్థా(అర్జునా), అసంఖ్యాకమైన రంగులు మరియు ఆకారాలతో ఎన్నో విధాలుగా వందల వేలలో ఉన్న అద్భుతమైన నా దివ్య స్వరూపములను చూడుము.