శ్లోకం - 6
పశ్యాదిత్యాన్ వసూన్ రుద్రాన్ అశ్వినౌ మరుతస్తథా | బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాణి భారత ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, పన్నెండు మంది ఆదిత్యులను(అదితి పుత్రులు), ఎనిమిది మంది వసువులను, పదకొండు మంది రుద్రులను, ఇద్దరు అశ్వినీ కుమారులను మరియు నలభైతొమ్మిది మంది మరుత్తులను చూడుము. అలాగే ఇంతకుముందు ఎప్పుడూ ఎరుగని అద్భుతములను కూడా తిలకించుము.