శ్లోకం - 8

న తు మాం శక్యసే ద్రష్టుమ్ అనేనైవ స్వచక్షుషా | దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కానీ, నా యొక్క విశ్వ రూపమును నీ భౌతిక కళ్ళతో చూడలేవు. కనుక, నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను. నా యొక్క దివ్యమైన యోగమును దర్శించుము.