శ్లోకం - 10

అనేక వక్త్ర నయనం అనేకాద్భుత దర్శనమ్ | అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధమ్ ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్టృతో పలికెను: అర్జునుడు చూస్తున్న ఆ విశ్వ రూపము ఎంతో అద్భుతమైనది. ఆ రూపము అనంతమైన ముఖములు, నేత్రాలు కలది. అనేకమైన దివ్య ఆభరణాలు, అనేక రకాల దివ్య ఆయుధాలు కలది...