శ్లోకం - 11
దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనమ్ | సర్వాశ్చర్యమయం దేవమ్ అనంతం విశ్వతోముఖమ్ ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్టృతో పలికెను: ఆ స్వరూపము దివ్య పుష్ప మాలలు, దివ్య వస్త్రాలు, దివ్య సుగంధములుతో సర్వం మహాద్భుతమైన, ప్రకాశవంతమైన, అనంతమైన ముఖములు అన్ని దిక్కులా నిండి ఉంది.