శ్లోకం - 14

తతః స విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః | ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిరభాషత ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్టృతో పలికెను: పరమాత్మ యొక్క అద్భుతమైన విశ్వరూపాన్ని చూసిన అర్జునుడు ఆశ్చర్యచకితుడై, ఆ తేజోమయమైన విరాట్ రూపానికి భక్తితో తల దించుకుని చేతులు జోడించి ఈ విధంగా పలికెను.