శ్లోకం - 15
అర్జున ఉవాచ పశ్యామి దేవాంస్తవ దేవ దేహే సర్వాంస్తథా భూతవిశేషసంఘాన్ | బ్రహ్మాణమీశం కమలాసనస్థమ్ ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ దేవాది దేవా, నీ దివ్య స్వరూపము నందు సమస్త దేవతలను, అసంఖ్యాకమైన ప్రాణకోటి సమూహములను, కమలంలో ఆసీనుడైన బ్రహ్మ దేవుడును, మహాదేవుడైన శంకరుడిని, సర్వ ఋషులను, దివ్య సర్పములను చూస్తున్నాను.