శ్లోకం - 16
అనేకబాహూదరవక్తృనేత్రం పశ్యామి త్వాం సర్వతో௨నంతరూపమ్ | నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ విశ్వేశ్వరా, అసంఖ్యాకమైన నీ చేతులు, ఉదరములు, ముఖములు, కన్నులు గల నీ దివ్య స్వరూపమును అంతటా చూస్తున్నాను. నీ యొక్క మహాద్భుతమైన రూపమునందు ఆది, మధ్యము, అంతము మాత్రం నాకు కనబడుట లేదు.