శ్లోకం - 17
కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం సర్వతో దీప్తిమంతమ్ | పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలార్క ద్యుతిమప్రమేయమ్ ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: కిరీటం, గద మరియు చక్రంతో అలంకరించబడి, ప్రతి దిశలో తేజస్సును ప్రసరింపజేస్తున్న నిన్ను దర్చించుచున్నాను. జ్వలించే సూర్యునిలా ప్రకాశిస్తున్న నీ దివ్య రూపమును చూడటానికి కష్టముగా ఉన్నది.