శ్లోకం - 19

అనాదిమధ్యాంతమనంతవీర్యం అనంతబాహుం శశిసూర్యనేత్రమ్ | పశ్యామి త్వాం దీప్తిహుతాశవక్త్రం స్వతేజసా విశ్వమిదం తపంతమ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నీవు ఆది - మధ్యము - అంతము లేనివాడివి, అపరిమితమైన శక్తి కలవాడివి, అసంఖ్యాకమైన బాహువులు కలవాడివి, సూర్య చంద్రులను నేత్రములుగా కలవాడివి, అగ్ని వలె ప్రకాశిస్తున్న ముఖము కలవాడివి. నీ తేజస్సు చేత ఈ సమస్త సృష్టిని తపింపజేయుచున్న నిన్ను నేను దర్శించుచున్నాను.