శ్లోకం - 20

ద్యావాపృథివ్యోరిదమంతరం హి వ్యాప్తం త్వయైకేన దిశశ్చ సర్వాః | దృష్ట్వాద్భుతం రూపముగ్రం తవేదం లోకత్రయం ప్రవ్యథితం మహాత్మన్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మహాత్మా, దివి నుండి భువి వరకు గల మధ్య ప్రదేశంతో పాటు అన్ని దిశలలో కూడా నీవే వ్యాపించి ఉన్నావు. నీ యొక్క అద్భుతమైన మరియు భయంకరమైన విశ్వరూపమును చూసి ముల్లోకములలో గల సర్వ ప్రాణులు భయ భ్రాంతులవుతున్నారు.