శ్లోకం - 23
రూపం మహత్తే బహువక్త్రనేత్రం మహాబాహో బహుబాహూరుపాదమ్ | బహూదరం బహుదంష్ట్రాకరాలం దృష్ట్వా లోకాః ప్రవ్యథితాస్తథాహమ్ ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ మహాబాహో! అనేక ముఖాలు, నేత్రములు, చేతులు, తొడలు, పాదాలు, ఉదరములు (పొట్టలు) మరియు కోరలతో (పళ్ళు) ఉన్న నీ భయంకరమైన విశ్వరూపమును చూసి అందరూ భయకంపితులగుచున్నారు. నేను కూడా భయపడుచున్నాను.