శ్లోకం - 24

నభఃస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాప్తాననం దీప్తవిశాలనేత్రమ్ | దృష్ట్వా హి త్వాం ప్రవ్యథితాంతరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: హే విష్ణో, ఆకాశాన్ని తాకుతూ, అనేక రంగులతో ప్రకాశిస్తూ, ఎన్నో తెరిచిన నోర్లు కలిగి, కాంతులను విరజిమ్ముచున్న విశాల నేత్రములతో ఉన్న నీ విశ్వ రూపమును చూస్తున్న నాకు భయముతో గుండె అదిరిపొతున్నది. నేను ధైర్యము మరియు శాంతి పొందలేకపోతున్నాను.