శ్లోకం - 25
దంష్ట్రాకరాలాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానలసన్నిభాని | దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ జగన్నివాసా, భయంకరమైన కోరలతో ఉన్న నీ ముఖము ప్రళయకాలంలోని అగ్ని వలె ఉన్నది. అది చూసిన నాకు దిక్కుతోచకున్నది. దిగులు పడుతున్న నాపై దయ చూపించు.