శ్లోకం - 27
వక్త్రాణి తే త్వరమాణా విశంతి దంష్ట్రాకరాలాని భయానకాని | కేచిద్విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: వారు భయంకరమైన కోరలతో ఉన్న నీ ముఖముల యందు పరుగులు తీస్తూ ప్రవేశిస్తున్నారు. వారిలో కొందరి తలలు నీ పళ్ళ మధ్య పడి చితికిపోయిన శిరస్సులతో కనబడుచున్నారు.