శ్లోకం - 30

లేలిహ్యసే గ్రసమాన సమంతాత్ లోకాన్ సమగ్రాన్‌ వదనైర్జ్వలద్భిః | తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ విష్ణుమూర్తీ, నీ భయంకరమైన నాలుకలతో ప్రతి దిశ నుండి లెక్కలేనన్ని ప్రాణులను తినేస్తూ మరియు మండుతున్న నోటితో వాటిని మింగేస్తున్నావు. నీవు సర్వవ్యాప్తి చెందిన కాంతి కిరణాలతో మొత్తం విశ్వాన్ని ప్రకాశింపచేయుచున్నావు.