శ్లోకం - 32
శ్రీ భగవానువాచ: కాలో௨స్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః | ఋతే௨పి త్వాం న భవిష్యంతి సర్వే యే௨వస్థితాః ప్రత్యనీకేషు యోధాః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: లోకసంహారానికి విజృంభించిన మహాకాలుడను నేను. ఇప్పుడు ఈ విశ్వంలోని ప్రజలను సంహరించడమే నా లక్ష్యం. కాబట్టి నీవు యుద్ధం చేయకపోయినా కూడా శత్రుసైన్యంలోని యోధులందరూ మరణం పొందుతారు.