శ్లోకం - 34
ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధవీరాన్ | మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠాః యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఇంతకు ముందే నాచే చంపబడిన ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు మరియు కర్ణుడు వంటి సమరయోధులందరినీ నీవు సంహరించు. కనుక భయపడకుండా యుద్ధం చేయుము. నీవు శత్రువులపై విజయం సాధిస్తావు.