శ్లోకం - 35

సంజయ ఉవాచ: ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ | నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీతః ప్రణమ్య ||

తాత్పర్యం

సంజయుడు ధృతరాష్టృతో పలికెను: శ్రీకృష్ణుడి మాటలు విన్న అర్జునుడు భయంతో వణుకుతూ, చేతులు జోడించి, నమస్కరించి, మరల మిక్కిలి భయముతో వినమ్రుడై గద్గద స్వరముతో ఇలా పలికెను.