శ్లోకం - 38

త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానమ్ | వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ అనంతరూపా, నీవు ఆదిదేవుడవు, సనాతనమైన పురుషుడవు. నీవు ఈ సమస్త జగత్తుకి ఉత్తమమైన ఆధారుడవు. నీవు సర్వజ్ఞుడవు మరియు తెలుసుకోబడవలసిన వాడవు. ఈ విశ్వమంతా పరంధాముడవైన నీచే వ్యాపించి ఉంది.