శ్లోకం - 39

వాయుర్యమో௨గ్ని ర్వరుణ శ్శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ | నమో నమస్తే௨స్తు సహస్రకృత్వః పునశ్చ భూయో௨పి నమో నమస్తే ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నీవు వాయు దేవుడవు, మృత్యు దేవుడైన యమధర్మరాజువు, అగ్ని దేవుడవు, వరుణ దేవుడవు, చంద్రుడవు మరియు ప్రజాపతియైన బ్రహ్మదేవుడవు. బ్రహ్మకు తండ్రివి కూడా నీవే. నీకు వేలాది నమస్కారములు, మళ్ళీ మళ్ళీ నమస్కారములు.