శ్లోకం - 40
నమః పురస్తాదథ పృష్ఠతస్తే నమో௨స్తు తే సర్వత ఏవ సర్వ | అనంతవీర్యామితవిక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతో௨సి సర్వః ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: అపరిమిత శక్తులు కల ప్రభువా, నీకు ముందు నుండి నమస్కారములు, వెనుక నుండి నమస్కారములు మరియు అన్ని దిక్కుల నుండి నా నమస్కారములు. అనంతమైన సామర్థ్యములు, అపరిమితమైన పరాక్రమము కలిగిన నీవు విశ్వమంతా వ్యాపించి ఉన్నావు. అందువలన సర్వమూ నీ స్వరూపమే.