శ్లోకం - 41

సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ! హే యాదవ! హే సఖేతి| అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: నీ మహిమ గురించి తెలియక మిత్రుడవనే ఉద్దేశంతో పొరపాటునో, చనువువల్లనో ఓ కృష్ణా, ఓ యాదవా, ఓ మిత్రమా అని తొందరపాటుతో ఆలోచింపక, నేను నిన్ను సంబోధించాను.