శ్లోకం - 42

యచ్చాపహాసార్థమసత్కృతో௨సి విహారశయ్యాసన భోజనేషు | ఏకో௨థవాప్యచ్యుత తత్సమక్షం తత్ క్షామయే త్వామహమప్రమేయమ్ ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ అచ్యుతా(కృష్ణా), విహార సమయమున కానీ, విశాంత్రి సమయమున కానీ, కూర్చొను సమయమున కానీ, భోజనం చేయు సమయమున కానీ, ఏకాంత సమయమున కానీ, ఇతరుల సమక్షంలో కానీ, పరిహాసము కొరకు నేను నిన్ను కించపరచి ఉండవచ్చును. నా తప్పులన్నింటినీ క్షమించమని నిన్ను వేడుకొనుచున్నాను.