శ్లోకం - 46

కిరీటినం గదినం చక్రహస్తమ్ ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ | తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే ||

తాత్పర్యం

అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఇంతకు ముందు ఉన్నట్లుగా కిరీటం, గదా మరియు చక్రంతో అలంకరించబడిన నిన్ను చూడాలని నేను కోరుకుంటున్నాను. వేయి బాహువులు కలిగిన ఓ విశ్వమూర్తీ! నాలుగు భుజాలతో పూర్వ రూపంలో నాకు కనుపించుము.