శ్లోకం - 49
మా తే వ్యథా మా చ విమూఢభావః దృష్ట్వా రూపం ఘోరమీదృఙ్మమేదమ్ | వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా ఈ భయంకరమైన విశ్వరూపమును చూసి భయపడకు, ఆందోళన చెందకు. నీవు ధైరంగా, ఆనందంగా నా పూర్వరూపాన్ని మళ్ళీ చూడు.