శ్లోకం - 50
సంజయ ఉవాచ: ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః | ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్యవపుర్మహాత్మా ||
తాత్పర్యం
సంజయుడు ధృతరాష్టృతో పలికెను: అలా శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పి తన పూర్వరూపమున దర్శనమిచ్చెను. ఆ తరువాత శ్రీకృష్ణుడు తన ప్రశాంతమైన శరీరంను స్వీకరించి భయపడుతున్న అర్జునుడిని ఓదార్చెను.