శ్లోకం - 53

నాహం వేదైర్న తపసా న దానేన న చేజ్యయా | శక్య ఏవంవిధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నీకు ప్రాప్తించిన ఈ విశ్వరూప దర్శనం వేదపఠనముల వలన కానీ, తపస్సులు చేయడం వలన కానీ, దానధర్మాలు చేయడం వలన కానీ, యజ్ఞ యాగాలు చేయడం వలన కానీ లభించదు.