శ్లోకం - 2
శ్రీ భగవానువాచ: మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే | శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: నా యందే మనస్సును నిలిపి, అచంచలమైన నిబద్ధతతో మరియు అత్యంత భక్తిశ్రద్ధలతో నన్ను ఆరాధించే వారు ఉత్తమ యోగులని నా అభిప్రాయము.