శ్లోకం - 5

క్లేశో௨ధికతరస్తేషామ్ అవ్యక్తాసక్తచేతసామ్ | అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కానీ అవ్యక్తమైన ఆత్మ స్వరూపము నందు ఆకక్తి కలవారు తగిన ప్రాప్తి పొందుటకు చేయవలసిన కృషి కొంత శ్రమతో కూడినది. ఎందుకంటే ప్రాపంచిక సుఖాలకు అలవాటుపడ్డవారికి అవ్యక్తమును(నిరాకార బ్రహ్మను) ఆరాధించటం కష్టసాధ్యమైనది.