శ్లోకం - 7
తేషామహం సముద్ధర్తా మృత్యుసంసార సాగరాత్ | భవామి నచిరాత్ పార్థ మయ్యావేశిత చేతసామ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: మనస్సును స్థిరంగా నా యందే నిలిపిన అలాంటి పరమ భక్తులను త్వరగానే అనుగ్రహించి మృత్యు రూపమైన సంసార సాగరం నుండి విముక్తి కలిగిస్తాను.