శ్లోకం - 14
సంతుష్టస్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః | మయ్యర్పితమనోబుద్ధిః యో మద్భక్తస్స మే ప్రియః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఎల్లప్పుడూ సంతృప్తి చెందినవాడు, నిత్యం భక్తితో ధ్యానం చేయువాడు, ఆత్మ నిగ్రహము కలిగినవాడు, దృఢసంకల్పము కలిగినవాడు, మనస్సును మరియు బుద్ధిని నాకు అర్పించిన నా భక్తుడు నాకు చాలా ప్రియుడు.