శ్లోకం - 19
తుల్యనిందాస్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ | అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: దూషణ మరియు పొగడ్తలను ఒకేలా తీసుకునేవాడు, స్వచ్ఛమైన మనస్సుతో మౌనముగా ధ్యానము చేసుకునేవాడు, తమకు లభించిన దానితో సంతృప్తి పడేవాడు, స్థిర నివాసం పట్ల మమకార అనురాగం లేనివాడు, బుద్ధి నా యందే స్థిరముగా నిలిపిన నా భక్తుడు నాకు ఎంతో ప్రియుడు.