శ్లోకం - 1
అర్జున ఉవాచ: ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ | ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ ||
తాత్పర్యం
అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికెను: ఓ కేశవా(కృష్ణా), ప్రకృతి, పురుషుడు, క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము మరియు జ్ఞానము యొక్క లక్ష్యము. వీటి గురించి తెలుసుకోవాలని నా కోరిక.