శ్లోకం - 2

శ్రీ భగవానువాచ: ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే | ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ కౌంతేయా(అర్జునా), ఈ శరీరము క్షేత్రముగా చెప్పబడినది మరియు ఈ శరీరము(క్షేత్రము) గురించి తెలిసిన వాడిని క్షేత్రజ్ఞుడు అని తత్వ జ్ఞానులు చెప్పెను.