శ్లోకం - 3
క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత | క్షేత్రక్షేత్రజ్ఞయోర్ జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సర్వ ప్రాణుల యొక్క క్షేత్రముల యందు క్షేత్రజ్ఞుడిగా ఉన్నది నేనే అని తెలుసుకొనుము. క్షేత్రముకి క్షేత్రజ్ఞుడికి సంబంధించిన జ్ఞానమే సంపూర్ణమైన జ్ఞానము అని నా అభిప్రాయము. ఎలాగంటే శరీరము, ఆత్మా, పరమాత్మాల(భగవంతుడు) గురించి తెలుసుకొవటమే నిజమైన జ్ఞానము.