శ్లోకం - 4

తత్‌క్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికారి యతశ్చ యత్ | స చ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: క్షేత్రము అంటే ఏంటి, అది ఎలా ఉండును, దాని స్వభావము ఎలా ఉంటుంది, దానిలో మార్పులు ఎలా వస్తాయి మరియు అది దేనిచే సృష్టించబడింది? అలాగే క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, అతని శక్తి శక్తిసామర్థ్యములు ఎలా ఉంటాయి? ఆ వివరములను అన్నింటిని సంక్షిప్తముగా చెబుతాను వినుము.