శ్లోకం - 6
మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ | ఇంద్రియాణి దశైకం చ పంచ చేంద్రియగోచరాః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: పంచ మహా భూతములు, అహంకారము, బుద్ధి, ప్రకృతి, పది ఇంద్రియములు(ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు), మనస్సు, ఐదు ఇంద్రియ గ్రాహ్యముల విషయములు... పంచ మహా భూతములు - భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము ఐదు కర్మేంద్రియములు - కంఠము, చేతులు, కాళ్ళు, జననాంగములు, గుదము ఐదు జ్ఞానేంద్రియములు - చెవులు, కళ్ళు, నాలుక, చర్మము, ముక్కు ఐదు ఇంద్రియ గ్రాహ్యములు - రుచి, స్పర్శ, వాసన, దృష్టి, శబ్దము