శ్లోకం - 7
ఇచ్ఛా ద్వేషః సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః | ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, శరీరము, చైతన్యము, ధైర్యము - వికారములతో(మార్పులు) పాటు ఇవన్నీ కలిపి క్షేత్రమని చెబుతారు.