శ్లోకం - 12

అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్త్వజ్ఞానార్థదర్శనమ్ | ఏతద్‌జ్ఞానమితి ప్రోక్తమ్ అజ్ఞానం యదతో௨న్యథా ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆధ్యాత్మిక జ్ఞానము యందు స్థిరముగా ఉండుట, తత్త్వజ్ఞానం వలన కలిగే ప్రయోజనాన్ని గ్రహించుట - ఇప్పటి వరకు తెలిపినవన్నీ జ్ఞానప్రాప్తికి సాధనములుగా చెప్పబడినవి. వీటికి వ్యతిరేకమైనవన్నియూ అజ్ఞానము.