శ్లోకం - 15
సర్వేంద్రియగుణాభాసం సర్వేంద్రియవివర్జితమ్ | అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అతడు ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నింటినీ గ్రహించగలిగినా కూడా ఆయన ఇంద్రియ రహితుడు. దేనిమీద ఆసక్తి లేకుండా సమస్త జగత్తును భరించి పోషించువాడు. అతడు గుణాతీతుడు అయినా కూడా ప్రకృతి సంబంధము వలన గుణములను అనుభవించుచున్నాడు.