శ్లోకం - 16

బహిరంతశ్చ భూతానామ్ అచరం చరమేవ చ | సూక్ష్మత్వాత్‌ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: అతడు సర్వ భూతముల బయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు. అతడు అతిసూక్ష్మస్వరూపం కలిగి ఉండడం వలన తెలుసుకోవడం సాధ్యం కాదు. అతడు చాలా దూరంగాను మరియు దగ్గరగా కూడా ఉన్నాడు.