శ్లోకం - 17

అవిభక్తం చ భూతేషు విభక్తమివ చ స్థితమ్ | భూతభర్తృ చ తజ్జ్ఞేయం గ్రసిష్ణు ప్రభవిష్ణు చ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఆ పరమాత్మ విభజించుటకు వీలు లేకుండా సర్వ ప్రాణులలో వేర్వేరుగా కనిపిస్తూ ఉంటాడు మరియు సమస్త ప్రాణులకు సంరక్షకుడు, పోషకుడు, లయకారకుడు, సృష్టికర్త అని తెలుసుకొనుము.