శ్లోకం - 20
ప్రకృతిం పురుషం చైవ విద్ధ్యనాదీ ఉభావపి | వికారాంశ్చ గుణాంశ్చైవ విద్ధి ప్రకృతిసంభవాన్ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: భౌతిక ప్రకృతి మరియు పురుషుడు(ఆత్మ) రెండిటికీ కూడా ఆది లేదని తెలుసుకొనుము. శరీరములోని అన్ని మార్పులూ మరియు ప్రకృతి త్రిగుణములూ కూడా భౌతిక శక్తి నుండే పుడుతున్నాయని తెలుసుకొనుము.