శ్లోకం - 25
ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా | అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: కొందరు ధ్యాన యోగము ద్వారా, మరికొందరు జ్ఞాన యోగము ద్వారా, ఇంకొందరు కర్మ యోగము ద్వారా ఆ పరమాత్మను తమలో దర్శించుచున్నారు.