శ్లోకం - 29

సమం పశ్యన్‌ హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్ | న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్ ||

తాత్పర్యం

శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: సమస్త ప్రాణుల యందు సమానముగా ఉండే పరమాత్మలో ఆ భగవంతుడిని చూసేవాడు ఆత్మాహంతకుడు కాడు, అనగా తనను తాను నాశనము చేసుకోడు. అందువలన అతడు మోక్షమును పొందుచున్నాడు.