శ్లోకం - 31
యదా భూతపృథగ్భావమ్ ఏకస్థమనుపశ్యతి | తత ఏవ చ విస్తారం బ్రహ్మ సంపద్యతే తదా ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: వేరువేరుగా కనుపించే సర్వ ప్రాణులు అన్నీ ప్రకృతి యందు స్థితమై ఉన్నట్టు చూసినప్పుడు మరియు ఆ ప్రాణులన్నియు ప్రకృతి నుండే జన్మించుచున్నాయని గ్రహించినప్పుడు, వారు బ్రహ్మజ్ఞానమును పొందుతారు.