శ్లోకం - 1
శ్రీ భగవానువాచ: పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమమ్ | యద్జ్ఞాత్వా మునయస్సర్వే పరాం సిద్ధిమితో గతాః ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: జ్ఞానములలో అత్యుత్తమమైన పరమజ్ఞానమును నీకు మళ్ళీ చెబుతాను విను. ఈ జ్ఞానమును తెలుసుకున్న మునులందరూ సంసార బంధముల నుండి విముక్తులై మోక్షమును పొందారు.