శ్లోకం - 2
ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః | సర్గే௨పి నోపజాయంతే ప్రలయే న వ్యథంతి చ ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నన్ను చేరుకుంటారు. అట్టి వారు సృష్టి సమయంలో మరలా జన్మించరు మరియు ప్రళయకాలంలో మరణించరు.