శ్లోకం - 3
మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్‌గర్భం దధామ్యహమ్ | సంభవః సర్వభూతానాం తతో భవతి భారత ||
తాత్పర్యం
శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికెను: ఓ అర్జునా, సృష్టికి కారణమైన నా యొక్క మహత్ బ్రహ్మ రూపమైన మూల ప్రకృతి నాకు గర్భాస్థానము. అందులో నేను సృష్టి బీజమును ఉంచడం వలన సర్వ ప్రాణులు జన్మించుచున్నాయి.